విమలచరిత్రా వీరాంజనేయా నమోస్తుతే యనరే
సమీరజా బహుసమర్ధ భాస్కరకుమారమంత్రీ యనరే
నమోస్తుతే రవికులమణిదూతా మము దయగను మపరే
కేసరినందన నమోస్తుతే హరిదాసాగ్రణి యనరే
భాసురకీర్తీ భవిష్యబ్రహ్మా బహువిక్రమ యనరే
వాయుపుత్ర హనుమంత సురారివైరిముఖ్య యనరే
శ్రీఆంజనేయా శ్రీరామదాసా శ్రితవరదా యనరే