సరసవచో నిథివి చాల మంచివాడవు ధరణిజాపతివి చాల దయగల దొరవు |
|
నిదురను గూడ నిన్ను మరువక ఎదురు చూచుచు నిన్నేళ్ళు పదిలముగా శుభభావన నిలిపిన యెదలో ఆశల నింకగ నీకుము |
సరస |
నీ కృపచే నిట నిర్మిత మైనది నాకు నెలవుగ నీవు చేసినది నీ కటాక్షమున నిలచియున్నది చీకి కూలి ధర చేరక మునుపే |
సరస |
సువిశాలంబును సుందరమగు నొక భవనము గాదిది పాతయిల్లు నీ కవరోధము వలె హాయి గొల్పగా సవరించితి నే శక్తికొలదిగా |
సరస |
24, జులై 2016, ఆదివారం
సరసవచోనిథివి చాల మంచివాడవు ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)