రావయ్యా యీ జీర్ణకుటీరము పావనముగ జేయ - వేగమె రావయ్యా నీ నిజభక్తునకు దీవన లందీయ బిరబిర |
|
నిదురను గూడ నిన్ను మరువక ఎదురు చూచుచు నిన్ని యుగంబులు పదిలముగా శుభభావన నిలిపిన యెదలో ఆశల నింకగ నీకుము |
రావయ్య |
నీ కృపచే నిట నిర్మిత మైనది నాకు నెలవుగ నీవు చేసినది నీ కటాక్షమున నిలచియున్నది చీకి కూలి ధర చేరక మునుపే |
రావయ్యా |
సువిశాలంబును సుందరమగు నొక భవనము గాదిది పాతయిల్లె నీ కవరోధము వలె హాయి గొల్పగా సవరించితి నే శక్తికొలదిగా |
రావయ్యా |
23, జులై 2016, శనివారం
రావయ్యా ఈ జీర్ణకుటీరము ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)