భామినీషట్పదలు
ఏమి చెప్పే దెంత ఘోరం
కాముకులతో నిండెలోకం
భూమిపై యిక స్త్రీలబ్రతుకులు నీటి బుడగలటే
రాము డేలిన భూమి మీదే
కాముకుల విజృంభణాలా
పాములై మగవాళ్ళు స్త్రీలను కాటు వేస్తారా
నెలలు నిండిన నెలత మీదా
నెలల బాలికమీద కూడా
విలువలన్నీ వదలి యెగబడి రోతపనులేనా
దులపరించే వారు లేరని
తలలు తీసే వారు లేరని
అలుసుగా మగవాళ్ళు స్త్రీలను కాటు వేస్తారా
ఎందుకొచ్చిన నీతి వాక్యా
లెందుకొచ్చిన పిచ్చి చట్టా
లెందుకొచ్చిన గొప్ప రక్షక భటులు చెప్పండీ
ఎందరయ్యా న్యాయదేవత
ముందు నిలబడి యీ పశువులను
బందిఖానా కైన నెట్టే పోరు సలిపేదీ
ఎప్పటికి యీ దుష్టులకు ఉరి
తప్పదని గర్జించి చట్టం
గొప్ప సాహసపూర్ణ తీర్మానమ్ము చేసేదీ
నిప్పురా ఒక ఆడదంటే
తప్పురా తన జోలి కెళితే
ముప్పురా ఉరిశిక్ష అని కాముకులు బెదిరేదీ
ఔత్సాహికులకోసం భామినీషట్పదగురించి వివరాలు:
కొంచెం క్లుప్తంగానే చెప్పటం ఇక్కడ బాగుంటుంది.
షట్పదలన్నీ మాత్రాగణాలతో లయాన్వితంగా ఉంటాయి. షట్పదలలోని అనేక రకాలలో భామినీషట్పద ఒకటి. ఇది మిశ్రగతిలో నడిచే గేయఛందం. దీని లక్షణం
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4 + 3 + 4 + 2
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4 + 3 + 4 + 2
యతినియమం లేదు! తెలుగులో యతినియమం లేనివి షట్పదలు మాత్రమే. ప్రాస నియమం ఉంది కాని రెండవ ఐదవ పాదాల్లో ప్రాస పాటించటం ఐఛ్ఛికం.
భామినీషట్పదలు కన్నడభాషలో మంచి ప్రచారంలో ఉన్నాయట. వాటికి అక్కడ కన్నడకస్తూరి అని ప్రసిథ్థి.