2, ఆగస్టు 2012, గురువారం

ఇంత కన్న లోకాన యెన్న డైన గాని

ఇంత కన్న లోకములో నెన్న డైన గాని

వింత మాట పుట్టినదా వేయి మాట లేల


మంచి చెడు లంటకుండ మసలుచుందు వట నీవు

మంచిమంచి పనులుసేయ మంచినేరుపరి వట

అంచితముగ నేను నీకు మంచిచాయ ననుచునే

మంచిదారి నడువశక్యమా నీకందువు రామ


గుణము లంటకుండ నీవు గొప్పగా నుండెద వట

రణములాడి దుర్గుణులను రాల్చివేయు చుంద వట

గణుతింపగ నీయందున కలిగితి నేనందువు దు

ర్గుణపాశలతల నెట్లు కోయుదు నేనందువు రామ


ఒంటిగాడవై హాయిగనుండ నీవు నేర్చెద వట

తంటాలను తీర్చి మంచిదారి చూపుచుందు వట

వెంటబడెద నింక నేను విడువబోనురా యంటే

అంటకాగి యుండలేవని యందువేమిరా రామ