ముంచ కుండ కురియు వాన మంచి వాన మమ్ము
ముంచెత్తు నీకృప రామ మంచి వానపుడమికి గంధపు పూత మొదటి వాన మా
యెడదల మతి మలదు నీదు కరుణ వాన
తడయనేల కురియ వయ్య కరుణ వాన మా
యెడల నీకు ప్రేమ హెచ్చై యెగయు గాన
నదుల నీరు నించి బ్రోచు నయ్య వాన మా
మదుల మంచి నించు నీదు కరుణ వాన
మృదులహృదయ కురియ వయ్య కరుణ వాన మా
కధికప్రేమ జూపు వాడ వగుదు గాన
మెతుకులు పండించు వర్షఋతువు వాన మా
బ్రతుకులు పండించు నీదు కరుణ వాన
సతతము కురిపించ వయ్య కరుణ వాన మా
కతులప్రేమాస్పదుడగు పతివి గాన