ఎక్కడి వాడో యీజీవుడు తా
నెప్పటి వాడో యీజీవుడు
మిక్కిలి నటనల యీజీవుడు పర
మేశ్వర వింతైన యీజీవుడు
క్రిందికి మీదికి గెంతుచు బహు ప
సందుగ నెగిరే జీవుడు
అందని వాటికి నర్రులు జాచుచు
క్రుందుచు నుండే యీజీవుడు
కాలతరంగిణి డోలలలోన
తేలుచుమునిగే జీవుడు
గాలికెగురు తృణకణము విధాన
తూలుచు నుండే యీజీవుడు
భూమిని నిత్యము పుట్టుచు చచ్చుచు
రాము నెరుంగని జీవుడు
ఏమో యెపుడో ఈశ్వరకృపచే
రామభక్తుడౌ నీజీవుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.