20, అక్టోబర్ 2026, మంగళవారం

హరా యనక హరీ యనక మరే మందువో

 

హరా యనక హరీ యనక మరే మందువో

మరే మనిన మోక్ష మబ్బు మాట సున్నరా


హరహర శివ శంభో యని యార్తితో పిలిచితే

పరమశివుం డగుచు నీకు పలుకునురా దైవము

హరదీక్షాపరుడ వగును నరజన్మము నడిపితే

మరల గర్భనరక మన్న మాట లేదు సత్యము


రామ రామ రామ యని ప్రేమతో పిలిచితే

రామచంద్రు డగుచు నిన్ను రక్షించును దైవము

రామభక్తివిశేషమే ప్రాణముగా బ్రతికితే

భూమి నింక నీ వెన్నడు పుట్ఝబోవు సత్యము


ఎవరెవరినొ యెంచి నీవు యింపుగా పిలిచితే

భువిని నిన్ను కటాక్షించబోదు కదా దైవము

వివర మెరిగి హరిహరులను వేడుకొన్న వారికే

భవబంధవిమోచన మను పలుకు మిగుల సత్యము



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.