శ్రీరాం జయరాం సీతారాం
కారుణ్యాలయ శ్రీరఘురాం
దినకరఘనకుల దీపన రాం
జననుతసద్గుణసంయుత రాం
మునిజనకామిత మోహన రాం
దనుజకులైకవిదారణ రాం
విరించిసన్నుతవిక్రమ రాం
ధరాతలేశ్వర దశరథ రాం
పురాణపూరుష సురేశ రాం
సురారిగర్వవిశోషణ రాం
పవమానాత్మజ భావిత రాం
భవనుత త్రిజగత్పావన రాం
భువనేశ్వర బుధపోషక రాం
ధవళేక్షణ భవతారక రాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.