20, అక్టోబర్ 2026, మంగళవారం

రాముడు రాడా రాముడు లేడా

 
రాముడు రాడా రాముడు లేడా
స్వామికి నాపై జాలే లేదా

ఎందుకు నన్నీ యిలపై కంపెను
ఎందుకు కష్టము లిన్నిటి నిచ్చెను
ఎందుకు మొరవిన నిచ్చగించడో
ఇందే మర్మం బిముడి యున్నదో

తన యాదేశమె తలపై దాల్చితి
తన కార్యములకె ధరకరు దెంచితి
తన పారమ్యమె ధర కెరిగించితి
తన కేమిటి కని దయరాదాయెను

పెక్కు జన్మముల పిలిచి యలసితిని
పెక్కు విధంబుల పిలిచి యలసితిని
ఒక్క మారయిన దక్కడు చూపుకు
ఒక్క మారయిన చక్కగ పలుకడు

కనబడితే నే వెనుదవిలెద నని
కనరాకున్నా డనుకొన వలెనా
కనరాకున్నా డని నే నలిగితి
ఘను డదియైనను గమనింపడుగా

కరుణాత్ముండని గట్టిగ పొగడితి
హరి యది వినియును కరుగడు చిత్రము
సరిసరి యిక నీ స్వస్థానమునకు
తిరిగి రమ్మనడు దేవుడు చూడుడు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.