12, అక్టోబర్ 2026, సోమవారం

నీవే దిక్కని నిజముగ నమ్మిన


నీవే దిక్కని నిజముగ నమ్మిన

జీవుడ నిక నీ చిత్తము రామా


అతిచపలాత్ముడ నతిమూఢాత్ముడ

నతిదుర్మార్గుడ నతిపాపాత్ముడ

నతిక్రూరాత్ముడ నయ్యును నీయెడ

నతివినయాత్ముడనై యనిశయంబును


దొరకిన జన్మము దురుపయోగముగ

దిరిగితి స్వల్పము లరయుచు ధరపై

మరవరాని నిను మరచి చరించితి

స్ఫురణ కలిగి యిదె శరణం బంటిని


పగవా డైనను పాదము లంటిన

తగిన విధంబుగ దయజూపెదవే

జగదీశ్వర నను సత్వర మేలగ

తగు నని తలపవె దశరథనందన


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.