20, డిసెంబర్ 2020, ఆదివారం

రారు!

పద్యముల కట్టు వారును
పద్యములను కుట్టు వారును
ఆ కట్టుకుట్ల గొప్ప లెంచు వారును
ఉరక భళీయటంచు యరచు వారును
నావ్రాత లరయ రారు.

కవుల మనువారు
బిరుదులు గలుగు వారు
కవుల సభలందు పాల్గొనగలుగు వారు
కవిముఠాలను నడిపించ గలుగు వారు
విరసులై యుంద్రు
నావ్రాత లరయ రారు

ఎప్పుడో ఎవ్వరో యిటు
తప్పిజారి చదువవత్తురు కాని
బ్లాగ్జాల కవులు గివులు పండితులును రారు
కేవలమును దారితప్పిన కొందరు తప్ప రారు

11 కామెంట్‌లు:

  1. రారు రారు నీ కోసం
    రారు ఎవ్వరూ నీ కోసం

    చందమామా నిజం చూడకు
    చూసినా సాక్ష్యం చెప్పకు....

    రిప్లయితొలగించండి
  2. గ్రూపుగట్టండి వత్తురు కూర్మి మెఱయ
    గొడవబెట్టండి వత్తురు గొడవబడగ
    గిచ్చి రచ్చసేయండి రావచ్చు మంది
    రామ రామా యటన్న రారండి రారు .

    రిప్లయితొలగించండి


  3. హతవిధీ యేమాయెను బో మా టపాల చదువు వారు రారే!


    రారు రారు రారు రాధన మిచ్చెడు
    నాదు బ్లాగు చదువ! నాల్గు పాద
    ములను బరుకు జనుల ముచ్చట గొల్పగ
    పొగిడి పొగిడి పొగిడి పోదురయ్యొ!


    నారదా
    కొంత సేద దీర్చుకొందు :)

    జిలేబి
    పరార్ :)

    రిప్లయితొలగించండి
  4. ఎవరికోసం వ్రాస్తున్నరో వారు వస్తున్నారా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి ప్రశ్న.
      ఆవిషయం గురించి నేడు చెప్పబోతున్నానండీ.
      మీ ఆసక్తికి ధన్యవాదాలు.

      తొలగించండి
  5. ఎవరికోసం వ్రాస్తున్నారో వారు వస్తున్నారా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వారు వారు రాములవారి కోసం వ్రాస్తున్నారండి. రాక పోవడమన్న ప్రసక్తే లేదు.



      జిలేబి

      తొలగించండి
  6. రామనామ స్మరణ చేయు మీకు రానివారి స్మరణా !!!??? 🤔

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. రాని వారిలో కూడా రాముల వారున్నారు కదండీ ఆ శాతం కూడా రాకుంటే పూర్ణత్వం ఎట్లా‌ అవుతుంది అదన్న మాట లలిత గారు

      సర్వే జనాః మమ ప్రియాః



      జిలేబి

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.