నవ్వినవ్వి యలసిన నాడది నీదయ యందును
నవ్వే లేని బ్రతుకైన నాడును నీదయ యందును
బలములు బలగములు నంది వచ్చిన నీదయ యందును
బలములు బలగములు నాకు తొలగిన నీదయ యందును
నలుగురు నను పొగడుచున్న నాడది నీదయ యందును
నలుగురు నను తెగడుచున్న నాడును నీదయ యందును
నాలుగు పాటలు పాడిన నాడది నీదయ యందును
నాలుక కొకటియును రాని నాడును నీదయ యందును
నా లక్ష్యము సిద్ధించిన నాడది నీదయ యుందును
నా లక్ష్యము సిధ్ధించని నాడును నీదయ యందును
జయములు కలిగిన వేళల స్వామీ నీదయ యందును
భయములు కలిగిన వేళల వలయును నీదయ యందును
తులలేని సద్భక్తి నాకు కలిగెను నీదయ యందును
జలజాక్ష రామా నీవే సకలము నాకని యందును
ఆర్తా విషిణ్ణా శిధిలాశ్చ భీతా....
రిప్లయితొలగించండిమిత్రులు శర్మ గారు,
తొలగించండిఅవునండీ. చక్కగా సెలవిచ్చారు. బహూకాలదర్శనం.
ధన్యవాదాలు.