4, నవంబర్ 2013, సోమవారం

అవునా? - 7
ఆ వసంతం ఒక్కటీ సరిపోయేది కాదా
ఈ‌ వేసవినీ చలికాలాన్నీ ఇవ్వటం దేనికి
నీవూ నేనూ ఉంటే సరిపోయేది సృష్టిలో
ఈ వెర్రిమొర్రి సరంజామా ఇక్కడ దేనికి
5 కామెంట్‌లు:

 1. ఎంత స్వార్దం ..శిశిరం ఉంటేనే వసంతం విలువ తెలిసేది,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును కదా!
   మనిషి ఆలోచనలో సుఖలాలస ఉంటుంది. అది వదుల్చుకోవటం కష్టం. భగవద్గీతల్లో ఒక ముక్క అంటాడు కృష్ణుడు భక్తియోగంలో ఉత్తమభక్తుడి లక్షణాలు వివరిస్తూ:

   సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః।
   శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః॥

   ఉత్తమభక్తుడికి, ఒకరుచేసే గౌరవంతో ఉప్పొంగటమూ ఉండదు - ఒకరి వల్ల అయ్యే అవమానం వల్ల కష్టమూ ఉండదు. వాడికి ఎముకొలకొరికే చలీ - నిప్పులకొలిమిలాంటి ఎండవేడీ రెండూ ఒకటే.

   మనకీ అలాగే ఉండే స్థితి వచ్చినప్పుడు అలాగే ఉండగలం కూడా. కాని ఆ స్థితికి ఇంకా చేరుకోని సామాన్యసాథకుడు ఇంకా పూర్తిగా ఇహప్రపంచపు లాలాస నుండి బయటపడ్డవాడు కాదు - అలాగని, భగవత్త్వత్తాన్నీ సరిగా పట్టుకున్నవాడూ కాదు. అలాంటి వాడి అమాయపుకపు ప్రశ్నయే ఈ‌ చిట్టి కవిత.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.