చిరుచిరు తృణకుసుమాల పూజలు
చేకొనగలవా దేవా
మరిమరి మురియుచు నీ కందీయగ
మరిమరి మురియుచు నీ కందీయగ
మాకడ నేమియు లేవుగా
మా మా రేకులు మరియును చిన్నవి
మా మా రేకులు మరియును చిన్నవి
మంచి వర్ణములు లేనివి
కోమలములు గా వేమియు స్వామీ
కోమలములు గా వేమియు స్వామీ
యేమను కొనక గ్రహించవే
మధురమధురములు మకరందంబులు
మధురమధురములు మకరందంబులు
మాకు కొంచెమును లేవుగ
వ్యధలే గాని సుధలే లేని
వ్యధలే గాని సుధలే లేని
వారము స్వామి గ్రహించవే
సుమనోహరములు సుకుమారంబులు
సుమనోహరములు సుకుమారంబులు
సొంపగు వాసన లెరుగమయా
విమలోదారము లమరు మనంబులు
వేడుక తోడ గ్రహించవేవిమలోదారము లమరు మనంబులు
బావి గట్టుమీద గడ్డి పువ్వు కూడా స్వామి పాదాల చెంతకి చేరాలనుకుంటుంది.
రిప్లయితొలగించండితుమ్మెద పూవు రంగుని చూస్తుందా!?
భగవంతుడు నిష్కలమైన భక్తినే కదా చూడగలడు.
ఆర్తి మీరు వ్రాస్తున్న గేయ వచనం చాలా బాగున్నాయి. సంతోషం..అండీ! ధన్యవాదములు.
అతి సహజ ప్రకృతీ విలాసాతులిత సుమ
రిప్లయితొలగించండిబాల ! మంచు ముత్యాల శోభల విరిసిన
మహిత సహజాత ! తృణ జాత ! మరల నీకు
సందియమ్మేల ? పరమాత్ము సరస జేర .
శ్యామల రావు గారూ ,
సుజన-సృజన బ్లాగు సందర్శించండి .