22, జూన్ 2012, శుక్రవారం

వేసములు వేనవేలు వేసివేసి విసివితిని

వేసములు వేనవేలు వేసివేసి విసివితిని
మోసపోతిని ప్రకృతి మూలమెరుగ లేనైతిని

నానా యాతనలు పడితి నల్పబోగములకు యే
మైనను ఒక సుఖమును మాట లేదు నాకు

గాసిలి నను బ్రోవమని కడకు నిన్ను వేడితిని
నీ సరి వారెవరు లేరు దాసపోష శరణంటిని

నేను నీవు నొకటనే నిశ్చయమున్నది గనుక
మానక నా యార్తి దీర్చు మాయ బాపు మంటిని

3 కామెంట్‌లు:

  1. గౌరవనీయులు శ్యామలీయం గారికి, ఈ కవితలో ఆఖరి పదం నాకు మహా బాగా నచ్చింది.ఎన్నెన్నోఅర్థాలు స్ఫురిస్తున్నాయి.

    నేను నీవు నొకటనే నిశ్చయమున్నది గనుక
    మానక నా యార్తి దీర్చు మాయ బాపు మంటిని
    ఎ.శ్రీధర్

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది శ్యామల రావు గారూ!
    నేను నీవు నొకటనే నిశ్చయమున్నది గనుక
    మానక నా యార్తి దీర్చు మాయ బాపు మంటిని,,,
    @శ్రీ

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.