సారెకు నిన్నే చక్కగ పిలువక
శాంత మెక్కడిది రా సఖుడా
వీరిని వారిని పిలిచి ముచ్చటల
తేరుటలో రుచి లేదుగదా
అన్నిట నీవే కాన వచ్చెదవు
చిన్నగ నవ్వుచు పలుకరించెదవు
నన్నెప్పుడు నెడ బాయకుందు విక
నిన్ను మరతునా నేనొక క్షణమును
నీ పనుపున నే నిల కేతెంచితి
నీ పనిలో క్షణ మేమరచితినా
లోపమగును నే నన్యము దలచిన
నీ పనియే నాపనిరా సుఖమును
యేనాటి దయ్య మన సాన్నిహిత్యము
ప్రాణ సఖుడ పరుల నే నెరుగనయా
నేనును నీవు నిటు మానుగ నొకటను
పూనిక నుంటిమి పొలుపు మీరగ నిక
శాంత మెక్కడిది రా సఖుడా
వీరిని వారిని పిలిచి ముచ్చటల
తేరుటలో రుచి లేదుగదా
అన్నిట నీవే కాన వచ్చెదవు
చిన్నగ నవ్వుచు పలుకరించెదవు
నన్నెప్పుడు నెడ బాయకుందు విక
నిన్ను మరతునా నేనొక క్షణమును
నీ పనుపున నే నిల కేతెంచితి
నీ పనిలో క్షణ మేమరచితినా
లోపమగును నే నన్యము దలచిన
నీ పనియే నాపనిరా సుఖమును
యేనాటి దయ్య మన సాన్నిహిత్యము
ప్రాణ సఖుడ పరుల నే నెరుగనయా
నేనును నీవు నిటు మానుగ నొకటను
పూనిక నుంటిమి పొలుపు మీరగ నిక
స్వీయరచనా మస్టారూ?
రిప్లయితొలగించండిచాలా బావుంది. బాణీ కట్టించారా ఎవరితోనైనా?
నారాయణస్వామిగారూ, శ్యామలీయం బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు. ఇది నా స్వీయరచనయే నండీ. మీకు యీ గీతం నచ్చినందుకు సంతోషం. నాకు యెవరితోనూ బాణీ కట్టించుకో నవుసరం లేదు. మరొకసారి నా వన్నీ స్వీయరచనలేనని విన్నవించుకుంటున్నాను. ఈ బ్లాగులో యిప్పటిదాకా దాదాపు డెబ్బది గీతాలు ప్రకటించాను. ఎవరూ యీ ప్రశ్న వేయలేదు. కాని యెవరో కొందరికైనా సందేహం ఉండవచ్చును కదా. అందరికీ సందేహనివృత్తి చేసే అవకాశం మీరు నాకు కలిగించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
రిప్లయితొలగించండిమాస్టారూ, నమస్కారం. నా ప్రశ్న మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉంది. క్షమించండి. స్వీయరచనా అని అడిగినది, ధృవీకరించుకోవడానికే తప్ప మీరు రాయలేదేమో అన్న ఉద్దేశంతో వేసిన ప్రశ్నకాదు. బాణీ ప్రస్తావన - ఇది గేయం కదా, సంగీత బాణీ కట్టించారా అని. మీరే గాయకులు కూడ అయితే, మీరే గానం చేసి ఉండచ్చు. అప్రయత్నంగా నైనా మిమ్మల్ని బాధ పెట్టినందుకు మరోసారి క్షమాపణ వేడుతున్నాను.
రిప్లయితొలగించండినారాయణస్వామిగారూ, నాకు బాధ కలుగలేదు, మీరు నిశ్చింతగా ఉండండి.
తొలగించండిఏ గీతం వ్రాసినప్పుడైనా వ్రాయసకారుడు కూడా యేదో ఒక బాణీని ఆశ్రయించుకొనక తప్పదు. ఏ బాణీ ఆలంబనమూ లేక వ్రాయటం సాధ్యంకాదు సాధారణంగా. అయితే, ఒక బాణీలో వ్రాయసకారుడు చేసినా అది యేమై ఉంటుందనేది సాధారణంగా ప్రకటించబడదు. సంగీతవిద్యలో నిష్ణాతులైతే రాగతాళ నిర్దేశనం చేయటం జరుగవచ్చు. అలాకాని పక్షంలో, వేరెవరైనా సంగీతజ్ఞులు స్వరపరచుతారు. ఒకే గేయానికి వేర్వేరు సంగీతజ్ఞులు వేర్వేరు విధాలుగా స్వరకల్పన చేయవచ్చును. ఒక్కొకసారి వివిధకారణాలవలన కవి యిచ్చిన రాగతాళాలలో కాక అన్యమైన రాగతాళాలు సమకూర్చటం కూడా జరుగుతూ ఉంటుంది.
జగత్ప్రసిధ్దమైన చందనచర్చిత నీలకళేబర అన్న తరంగం మోహనంలో వినిపిస్తోంది కాని కవిగారు రామక్రియారాగేన ఆదితాళేన గీయతే అని యిచ్చినట్లు గుర్తు. మధురానగరిలో కీర్తన యెవరికితోచినట్లు వారు కచేరీలలో స్వరపరచి వినిపిస్తుంటే, కవిగారే దానికి స్వయంగా ఆనందభైరవిలో స్వరనిర్దేశనం చేసారని చదివినట్లు గుర్తు.
నేను గాయకుడినా అంటె, అంతంత మాత్రం! మా శ్రీమతి మంచి గాయకురాలు.
బూరెల విందుకు నిన్నే చక్కగ పిలువగ
రిప్లయితొలగించండివాంతులు ఎక్కడివిరా సఖుడా
వీరిని వారిని పిలిచి విందుల
ముంచుటలో రుచి యున్నదిగా
బాణలిలో అంతట నీవే కానరాగా
చక్కగ నేతితో పలుకరించెదవు
నా జిహ్వనెప్పుడు నెడ బాయకుందు విక
నిన్ను మరతునా నేనొక క్షణమును
నీ రుచిమాటున నే స్వర్గముకేతెంచితి
గొంతు దింపుటలో క్షణమేమరచితినా
ముగనగును నే నన్యము దలచిన
నీపని పట్టుటయే పనిరా దవడలకును
యేనాటి దయ్యము మన సాన్నిహిత్యము
జిహ్వసఖుడ ఇతర వంటలు నే నెరుగనయా
నేనును నీవు నిటు మానుగ నొకటను
పూనిక నుంటిమి పొలుపు మీరగ నిక
అయ్యా శ్యామలీయంగారూ - చాలా బావుంది మీ రచన.
మీకు కోపం వచ్చినా సరే, కొద్దిగా ఈ నా అప్రయత్న పేరడీ రచనను మీదైన శైలిలో ఛందోబద్ధం కావించి బూరెలంటే మక్కువున్న ఈ చిన్నవాడికి ఆనందం కలుగచెయ్యాలని ప్రార్థిస్తూ....
పెద్దవారు - మీకు ముందస్తు క్షమాపణలతో ...మీ ఈ రచనే నా చేత ఇలా రాయించింది కాబట్టి మిమ్మల్నే అడుగ సాహసిస్తున్నా.....
దీనిమూలాన, అనగా ఈ పేరడీమూలాన వచ్చే పనికిమాలిన వారి కామెంట్లతో మీకు క్షోభ కలిగితే అందుకు కూడా ముందుగానే నా తరఫు నుంచి క్షమాపణలతో...
దండం ప్రయోగించదలచితే చక్కగా డిలీటు చేసెయ్యవచ్చు....నేనేమీ అనుకోను....
మాగంటివారూ,
రిప్లయితొలగించండిస్వాగతం.
ఈ పాటకు మీరు పేరడి కట్టటం పట్ల నాకు ఆక్షేపణ యేమీ లేదు. నాకు కోపం యేమీ రాలేదు. నిశ్చింతగా ఉండండి. పకోడిమీద పద్యాలూ, కాఫీమీద దండకమూ వగైరా హాస్యస్ఫోరకాలేకాని అక్షేపణీయములు కావుగదా. మరల మరల ప్రయత్నించి మీరు చాలా బాగా వ్రాయగలరనిపిస్తోంది. మీ చిత్రరచన అలాగే అభివృధ్ధి చెందటం చూసాను గదా అందుకే అలా నమ్మకంగా అన్నాను.
నేను వ్రాయసకాడిని మాత్రమే. వ్రాయించే వాడి అభిమతం మేరకే గీతం వెలువడింది. నిమిత్తమాత్రుడిని. వంట చేసినవారి అభిమతం కన్నా చేయించుకొన్నవారి అభిరుచియే కనిపిస్తుంది కదా. వంటకు ఉపకరణాలైన పొయ్యూ, గిన్నెలూ గరిటెలెన యెవరూ పొగడనవుసరంలేదు కదా. అలాగా కేవలం వ్రాసిన చేయి మాత్రమే యిది. అంతకు మించి ప్రత్యేకత యేమీ లేదు.
అన్నం పరబ్రహ్మస్వరూపం. కాబట్టి బూరెలు అల్పవస్తువులని అనలేను. కాని ఐంద్రియమైన చాపల్యం అనేది నిశ్చయంగా అల్పవస్తువే. కాబట్టి మీరడిగినది చేయలేనేమో.
కేవలం సభామర్యాదకు భంగకరంగా ఉండే వ్యాఖ్యలు తప్ప మరే వ్యాఖ్యనూ తొలగించను. మీగీతంతో సహా మీవ్యాఖ్య పదిలం. ఏమో, మీగీతం అనేక మందికి నచ్చుతుందేమో!
శ్యామలీయం గారు
రిప్లయితొలగించండిరెండోసారి కూడా నేననుకున్న సమాధానమే ఇచ్చినందుకు ధన్యవాదాలు...
భవదీయుడు
వంశీ
ఎంత మంచి గీతం! చాలా బాగుంది బాబాయిగారూ
రిప్లయితొలగించండిచాలా రోజుల తరువాత మీ గీతాలన్నీ చదివాను
నా మనసే ఒక నాట్యగత్తెగా మారి ఒక కొత్త జావళి ని అభినయించినట్లుగా అనిపించింది.
అమ్మా విరజాజీ
రిప్లయితొలగించండిగీతాలన్నీ ఓపిగ్గా చదివినందుకు చాలా చాలా ఆనందం.
ఇవి నీ ఆధ్యాత్మికసాధనకు సహాయపడతాయని విశ్వసిస్తున్నాను.
ఎందుకంటే ఒక సాధకుని అనుభూతులు ఇతర సాధకులకూ తప్పక ఉపయోగపడతాయి కాబట్టి.
కనీసం ఒకరికి ఆధ్యాత్మికంగా అభివృధ్ధిమార్గంలో నడవటానికి ఉపయోగపడినా వీటికి సార్థకత చేకూరినట్లే.
ఆశీః