19, జూన్ 2012, మంగళవారం

ఇదే ఇదే వచ్చితిరా ఇక నీవే చాలునురా

ఇదే ఇదే వచ్చితిరా ఇక నీవే చాలునురా
సదయా నీ సన్నిధిని వదిలేది లేదురా

నీదు మధురమధుర వచోమకరందము గొన వచ్చితి
నీదు చంద్రప్రభాధవళదరహాసము కన వచ్చితి

నీదు కృపామృతసరసిని జలకము లాడగ వచ్చితి
నీదు పాదసరోజముల కనుల కద్దు కొనవచ్చితి

నీదు చెలిమి కోరి జగము నెల్ల విడిచి యిటు వచ్చితి
నీదు కలిమి కోరి నన్ను విడువ వని యిటు వచ్చితి

4 కామెంట్‌లు:

 1. గౌరవనీయులైన శ్యామలీయం గారికి, నమస్సులు
  మీకవిత చాలా బాగుంది. ముఖ్యంగా ఈ క్రింది పదాలు
  చాల అర్థవంతంగా ఉన్నాయి !

  నీదు చెలిమి కోరి జగము నెల్ల విడిచి యిటు వచ్చితి
  నీదు కలిమి కోరి నన్ను విడువ వని యిటు వచ్చితి

  రిప్లయితొలగించండి
 2. నమస్కారం శ్రీధర్ గారు. శ్యామలీయం బ్లాగుకు సుస్వాగతం.
  మీకు యీ గీతం నచ్చినందుకు చాలా సంతోషం.
  ఈ శ్యామలీయం బ్లాగులో దాదాపు 70 కవితలున్నాయి.
  దయచేసి వాటిపై కూడా మీ అమూల్యాభిప్రాయాలు తెలియజేయవలసినది.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.