12, సెప్టెంబర్ 2011, సోమవారం

నీ లీల

అద్దంలో నా బొమ్మ నాకు బాగానే కనిపిస్తోంది
ఇందులో నా లీల అంటూ యేమన్నా ఉందా
నీ విశ్వదర్పణంలో నువ్వు ప్రతిఫలిస్తుంటే
అదేదో నీ లీల అనడం యెందుకో చెప్పు?

విశ్వాన్ని నువ్వు సృష్టించడమే లీల అనుకుందామా
ఈ లీలని నువ్వు యెవరికోసం చేస్తున్నట్లు చెప్పు
నువ్వు తప్ప వేరే యెవరూ నాకు కనబడటం లేదే
సృష్టించడం నీ స్వభావమైతే  లీల యెలా అవుతుంది

అందుకే నిన్ను నీవు  నన్నుగా కల్పిచుకొన్నావా
అందంగా విశ్వవినోద క్రీడను మొదలు పెట్టావా
ఇప్పుడర్ధమౌ తున్నది నీ లీల యేమిటో నాకు
ఇన్నాళ్ళూ నేనంటూ ఉన్నాననుకుంటున్నాను

2 కామెంట్‌లు:

  1. అద్భుతం సర్. కఠోపనిషత్ లో ఒక బాగం మాకు సులువు గా అర్ధమయ్యేటట్టు చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది.అద్భుతం...
    బాగా అర్ధమవుతుంది దైవ లీల ఏమిటో..

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.