హరియిచ్చు హరియిచ్చి నపుడే వచ్చు
సురలకైన నరులకైన సొంపుగాను
అన్నోదకంబు లైన నఖిలసంపద లైన
కన్పుముక్కు తీరైన కదలుశక్తి యైన
తిన్ననైన బ్రతుకైన ధీశక్తియే యైన
చిన్న మెత్తు సుఖమైన సేమమించు కైన
నాజూకు వపుషమైన నడత నొక సొంపైన
రాజభోగంబు లైన రమ్యగృహ మైన
తేజో విలాస మైన దినవెచ్చ మైన
ఆజానకీ విభుని యానతిచే నమరును
భామయైన పుత్రుడైన వంశాభివృధ్ధి యైన
భూమినింత కీర్తి యైన పొరి శుభేఛ్ఛయైన
రాము డీయనిది మనకు రాదు గాక రాదు
రాముడు దయతలచెనా రాదు మరల భవము