దేవుడవని మొన్ననే తెలిసికొంటిని కావుమని నిన్ననే వేడుకొంటిని ఈవేళ వత్తువని వేచియుంటిని నీ వేవేళకు వత్తువో తెలియకుంటిని |
|
కబురు చేయుదమంటే కనబడరే నా కెవరూ కబురు పంపుటకు నీకు కనబడలేదా ఎవరూ గుబులాయె రామ ఈ జీర్ణకుటీరము నీకు సబహుమానముగ తగిన స్వాగత మిచ్చేనా |
॥దేవుడవని॥ |
గొప్పగొప్పవారు నిన్ను కొలువ వైకుంఠములో తప్పనిసరి పనుల మధ్య తలమునక లైతివో ఎప్పటికి వీలు చిక్కి యిటు వచ్చెదవో రామ అప్పటికే జీర్ణకుటిని ఆరగించు కాలము |
॥దేవుడవని॥ |
వేదాంతిని కాను నేను విద్యలేవి నేర్వలేదు నీ దారితెన్నులను నేనెఱుగ నేనెఱుగ ఓ దయామయ నమ్మి యున్నాను వత్తువని వేదన లడలించవయ్య విచ్చేయ వయ్య రామ |
॥దేవుడవని॥ |
17, మే 2015, ఆదివారం
దేవుడవని మొన్ననే తెలిసికొంటిని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)