శ్రీ శంకరంబాడి సుందరాచారిగారు రచించిన ఈ పాటను టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో ఇక్కడ వినండి.
ఈ వీడియోలో ఉన్న మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాటను సూర్యకుమారిగారు 1985వ సంవత్సరంలో బర్మింగ్‌హామ్‌లో శ్రీరంగారాయ మెడికల్ కాలేజీ పాత విద్యార్థుల పునస్సమాగమం సందర్భంగా జరిగిన ఉత్సవంలో గానం చేసారు.
ఈ పాట ఆంధ్రప్రదేశప్రభుత్వ అధికారిక గీతం.
ఈ పాట పూర్తి పాఠం ఇదిగో:
మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి |
గల గలా గోదారి కదలి పోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలు తాయి |
అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక |
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం |
ఈ పాట ఒరిజినల్ రికార్డింగ్ అంటూ మరొక వీడియో కూడా కనిపించింది:
అలాగే, బాలూగాత్రంలో ఇదే మా తెలుగు తల్లికి పాట కూచిపూడి నృత్యాభినయ యుక్తంగా:
ఈ పాటకు క్రొత్త వరస కూడా ఉన్నది! చూడండి:
ఇంత చెప్పుకున్నాక మరొకటీ చెప్పుకోవాలి మరి. ఈ పాటకు తెలంగాణావాదుల పేరడీ చూడండి.
(టంగుటూరి సూర్యకుమారిగారి గురించి వికీపీడియాలో చదవండి.)
(శంకరంబాడి సుందరాచార్యులవారి గురించి వికీపీడియాలో చదవండి.)