మౌని గాథిసుతుడు గొప్పమఖము చేయ నెంచి భూ
జాని కడకు వచ్చి రామచంద్రు నడిగె రక్షగా
కానలకును తపసి వెంట ఘనుడు లక్ష్మణుండు తో
డైన దివ్యమూర్తి రాము డంత నడచె వేడుకన్ 208
దనుజ నమిత క్రూరయైన తాటకన్ వధించి యా
ముని సవనము జెరుప వచ్చు ముష్కరులను చెండి మా
నిని యహల్య శాపమూడ్చి నీరజాక్షు డంత నా
జనకు నింటి స్వయంవరపు సభకు నేగె మౌనితోన్ 209
భూమి దున్ను చున్న జనక భూమి నాథు ముంగటన్
భూమి నుండి యుద్భవించి పుత్రియైన సీత ను
ద్దామ విక్రముండు రుద్రు ధనువు నెక్కుపెట్టి శ్రీ
రాము డంత పెండ్లియాడె రమ్యగుణవిశాలుడై 210
హరుని విల్లు విరుగు టెరిగి యాగ్రహించి వేగమే
పరశురాము డేగు దెంచి పట్టి యెక్కు పెట్టు మీ
హరిశరాసనం బనంగ నంత దానితోడ శ్రీ
హరిమహాంశ నతడి నుండి యాహరించె రాముడున్ 211

.................... ఉత్సాహరామాయణం ఇంకా ఉంది