లేనే లేదయ్య రామ లేనే లేదు
లేనే లే దేనాడును లేనే లేదు
లేనే లే దేనాడును లేనే లేదు
నీనిండుకృపకు సాటి లేనే లేదు
నీనీలతనువు సాటి లేనే లేదు
నీనీటునకు సాటి లేనే లేదు
నీనిశితశరము సాటి లేనే లేదు
నీనిండు సభకు సాటి లేనే లేదు
నీనిజవైభవము సాటి లేనే లేదు
నీనిజయశంబు సాటి లేనే లేదు
నీనామమునకు సాటి లేనే లేదు