శ్రీకాంతు డీత డని మీకు తెలియదా సకల
లోకనాథు డీత డని మీకు తెలియదా
లోకనాథు డీత డని మీకు తెలియదా
శోకమోహములు తగవు మీకు తెలియదా హరి
శోకమోహనాశకుడు మీకు తెలియదా
శోకమోహనాశకుడు మీకు తెలియదా
మేలు హరిని గొలుచుట యని మీకు తెలియదా ఒరులు
మేలు చేయ లే రనియు మీకు తెలియదా
మేలు చేయ లే రనియు మీకు తెలియదా
సాకేతరాము డితడు మీకు తెలియదా భక్త
లోకవరదు డీతడు మీకు తెలియదా
లోకవరదు డీతడు మీకు తెలియదా
పాకారివినుతు డితడు మీకు తెలియదా దనుజ
భీకరుడు రాము డితడు మీకు తెలియదా
భీకరుడు రాము డితడు మీకు తెలియదా
కాకుత్స్థరాము డితడు మీకు తెలియదా వీడు
మీకు మోక్షమిచ్చు నని మీకు తెలియదా
మీకు మోక్షమిచ్చు నని మీకు తెలియదా
వైకుంఠుడె రాముడని మీకు తెలియదా ఈ
లోకమే రామమయము మీకు తెలియదా
లోకమే రామమయము మీకు తెలియదా