శ్రీరామ వేగ నా చేయందుకో
మేలులేదు చదువులతో మేలులేదు పదవులతో
మేలులేదు ధనములకా మించుట లోన
మేలులేదు సతీసుతమిత్రబంధుగణముతో
మేలులేదు పదేపదే మేదినికి వచ్చుటలో
చాలవిసిగిపోతినిరా జన్మముల నెత్తియెత్తి
చాలునురా జరిగినది వేలతనువుల
ఈలాగున భవాంబుధి నెన్నిమునకలైనవోచాల డస్సి యుండినిరా సర్వేశ్వరా
ఏలాగున నెప్పటికో యేదో మోక్షమున్న దంటే
చాలదురా జన్మలెత్త జాలనురా నేను
జాలిచూపి భవతరణము సత్వరమే చేయించి
యేలరా దయామయా యేల జాగుచేసేవు