గండరగండడవు నీవు కాంతలము మేము గాన మెండుధాష్టికమును జూపి మెఱసెదవీవు |
|
ఎన్నెన్నో యిళ్ళుకట్టి యెన్నరాని వింతలకు నన్నిటిని నెలవుచేసి యందాలను కుప్పబోసి యన్నన్నా యెందరినో యన్ని చోట్ల నిలిపేవు పన్నుగ నీమాయలోన పడద్రోసి యుంచేవు |
గండర |
ఇందరుండి యిన్నిచోట్ల నెఱుగ రెవరు నీపేరు అందరిలో తిరిగెడు నిన్నరసిన జాణలు లేరు ఎందునుండి యిటువచ్చెద వెఱిగిన వారలు లేరు ఎందులకని యిటనుంటిమొ యెఱిగిన వారలు లేరు |
గండర |
పనులన్నీ మాని నిన్ను పట్టదలచి తిరుగువారు కనుగొంటిరి వారు నీదు కరుణామృతవృష్టిని ఘనులు వారు రాముడవని నిను జెప్పగ వింటిమి మనసారగ నిను గొల్చుచు వినుతించుచు నుంటిమి |
గండర |
22, సెప్టెంబర్ 2016, గురువారం
గండరగండడవు నీవు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)