ఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బనియేమి శాశ్వతసుఖమే నాదైతే క్షిణికసుఖంబుల పనియేమి |
|
ఎఱుగదగినదే యెఱిగితినా యితరవిద్యలే వలదు కదా పొరబడి హరినే మరచితినా పొందగలిగినది లేదు కదా కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు పరమాత్ముడు శ్రీరాముడు నన్ను పాలించుటయే చాలు గదా |
ఈశ్వరుడే |
చిరుచిరువరములు కురిసేవారగు సురలనడుగుటే వలదుకదా పొరబడి యడిగి తప్పైనదని పొగులుకర్మమే వలదుకదా కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు పరమాత్ముడు శ్రీరాముడు నన్ను పాలించుటయే చాలు గదా |
ఈశ్వరుడే |
అరకొర బ్రతుకుల నరులకు దొరకని హరికృప దొరకిన చాలుగదా పరమభాగవతజనమందారుడు వదలకబ్రోచిన చాలుగదా కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు పరమాత్ముడు శ్రీరామముడు నన్ను పాలించుటయే చాలుగదా |
ఈశ్వరుడే |
18, సెప్టెంబర్ 2016, ఆదివారం
ఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బని యేమి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)