వసుధ. నిను వేడుదునే కనవేల నయా జనకాత్మజనే వినువాడ వొకో |
వసుధ.
ఈ వసుధా వృత్తానికి గణవిభజన స-స. అంటే పాదానికి ఆరు అక్షరాలు. ప్రాస అవసరం. యతిస్థానం అవసరం లేదు.
ఈ వసుధా వృత్తానికి కిసలయ అనీ తిలక అనీ కూడా మరొక రెండు పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.
సులభమైన పద్యం.
పాదం నిడివి తోటకం పాదం నిడివిలో సగం! అవే స-గణాలు. కాబట్టి తోటకంలో వసుధావృత్తాన్ని ఇమిడ్చి వ్రాయవచ్చును, చిత్రకవిత్వంగా.