మణిరంగం. శ్యామలాంగ వియచ్చరపూజ్యా రామచంద్ర సురారివిరోధీ నామనంబున నమ్మితి నయ్యా ప్రేమ నేలవె వేదసువేద్యా |
ఈ మణిరంగం మరొక పొట్టి వృత్తం.
గణవిభజన ర - స - స - గ .
యతిస్థానం 6వ అక్షరం.
ప్రాసనియమం ఉంది.
నడక ప్రకారం దీని గణ విభజన (హ భ) (భ గగ) అన్నట్లు ఉంటుంది. సరిగా యతిస్థానం దగ్గర ఖండనతో.
ఉదాహరణకు నా పద్యాన్ని ఇలా నడక ప్రకారం విరచి చూపవచ్చును.
శ్యామ - లాంగ వి - యచ్చర - పూజ్యా
రామ - చంద్ర సు - రారివి - రోధీ
నామ - నంబున - నమ్మితి - నయ్యా
ప్రేమ - నేలవె - వేదసు - వేద్యా
ఇలా మణిరంగ వృత్తాలు సులువుగా వ్రాయవచ్చును. ఆసక్తి కలవారు ప్రయత్నించండి మరి.