21, అక్టోబర్ 2015, బుధవారం

హతభాగ్యుడు







     చ. కరయుగళంబు రామహిత
          కార్యప్రయుక్తము కాక యున్నచో
     చరణయుగంబు రామహిత
          కార్యనియుక్తము కాక యున్నచో
     నిరతము రామనామజప
          నిష్ఠను నాలుక యాడకున్నచో
      హరహర యేమి జన్మమది
            యా హతభాగ్యుని కేది దిక్కయా