| ఈ మహితసృష్టి యంతా రామనాటకము శ్యామసుందరదేవుని ఆరామనాటకము |
|||
| అందరూ అందరితో ఆడే నాటకము అందరూ దొంగాటలు ఆడే నాటకము సుందరతర రంగస్థలి చొచ్చి ప్రతిజీవి అందమంతా నాదే అనుకొనే నాటకము |
ఈ మహిత | ||
| ఆడించేవాడి నెరుగ నట్లుండే నాటకము ఆడే ఆట తనయిఛ్ఛ అనుకొనే నాటకము అడే ఆట అతనిదే అని మరచి ప్రతిజీవి గోడగించి ఆడిఆడి కూలబడే నాటకము |
ఈ మహిత | ||
| ఆద్యంతములులేని అందమైన నాటకము హృద్యమైన కథలతో ఎసగు మంచి నాటకము చోద్యమైన ఆటలో చొక్కి ఆడి ప్రతిజీవి విద్యలెన్నొ చూపించి వెడలిపోవు నాటకము |
ఈ మహిత | ||
2, ఆగస్టు 2015, ఆదివారం
ఈ మహితసృష్టి యంతా రామనాటకము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)