శ్రీరామచంద్రులవారికి స్నానానంతరం మంచి వస్త్రాలను సమర్పించుకోవాలి.
వస్త్రాలంటే కట్టుకోవటానికి పంచె, పైన కప్పుకుందుకు ఉత్తరీయమూ.
వస్త్రం
కం. ఈ నామనమును బుధ్ధియు
ప్రాణేశ్వర నీకు మంచి వస్త్రంబులుగా
నే నిదె యిచ్చెద గొనుమా
జ్ఞానానందామృతాబ్ధి జానకిరామా
తాత్పర్యం. ఓ నా ప్రాణాలకు అధినాయకుడవైన శ్రీరామచంద్రప్రభూ, ఓ జ్ఞానానందం అనే సముద్రం వంటిజానకీ రామా, నీకు ఇదే వస్త్రద్వయం సమర్పించుకుంటున్నాను. ఈ నా మనస్సూ, బుధ్ధీ అనేవే నీకు నేను సమర్పించుకోగల అత్యత్తమమైన వస్త్రాలు. దయతో వీటిని స్వీకరించండి.
(ఆగష్టు 2013)