శ్రీరామ మారాథ్యపాదుకం కారుణ్యవారాన్నిధిం భావయే
ధీరం హరిం సత్యసారం భవాంభోధిపారం సదా భావయే
శరణాగతత్రాణబిరుదాంకితం వీరవరసేవితం భావయే
సురవైరిగణగర్వశోషణం సురలోకపరిసేవితం భావయే
నిరుపాధికం లోకపరిపాలకం సర్వనిగమార్చితం భావయే
నరనాయకం భక్తవరపోషకం మోక్షవరదాయకం భావయే
సాకేతనాథం సదానందకందం ప్రశాంతాకృతిం భావయే
లోకైకవీరం సదానిర్వికారం త్రిలోకార్చితం భావయే
వైకుంఠవాసం జగత్పూజ్యమూర్తిం భవారాధితం భావయే
శోకాంతకం జన్మచక్రాంతకం సర్వలోకేశ్వరం భావయే
రామం సదా దివ్యమూర్తిం హరీంద్రాది సంప్రార్ధితం భావయే
రామం సదా జానకీయుక్తమత్యంతరమ్యాకృతిం భావయే
రామం సదానందరూపం సదాచిద్విలాసం సదాభావయే
రామం సదాసుప్రకాశం మహామోహప్రధ్వంసినం భావయే
చేతులెత్తి నమస్కరింతు నీకృతికి
రిప్లయితొలగించండిసీతారామ్, ఈకీర్తన నీకు నచ్చినందుకు అనేక ధన్యవాదాలు. అంతా రామానుగ్రహం వలన వచ్చినది కాని నాఘనత అంటూ ఏమీ లేదు. నాకు సంస్కృతం ఏమీ రాదు. అన్ని ముక్కలూ రాముడు నానోట పెట్టి వ్రాయించినవే కాని నేనెంతవాడను. సర్వం శ్రీరామానుగ్రహం!
తొలగించండికీర్తన బాగుంది. పాడుకోడానికిన్నీ అనువుగా ఉంది,మంచి భావం కూడా అనిపించింది. కాని చిన్న కుశ్శంక. శ్రీరామ మారాధ్య పాదుకాం అన్నదేకొంచం నట్టుతోంది. శ్రీరామాధ్య పాదుకాం భవయే అనకూడదా? అంటే భావం తేడా వస్తుందా?
రిప్లయితొలగించండిఐదేసి మాత్రలకు విరుగుతూ ఖండగతిలో వస్తుందండీ.
తొలగించండిశ్రీరామ । మారాథ్య । పాదుకం । కారుణ్య । వారాన్ని । ధిం భావ । యే
అని గానసౌలభ్య విభజనను దృష్టిలో ఉంచుకుంటే సరి. చివరన ఉన్న గురువును తాళప్రయోజనానుసారిగా కొనసాగించుకోవచ్చును. ఈపాదంలో శ్రీరామ । .... ..... । వారాన్ని । అన్నది గమనించండి. ప్రాసయతి వాడబడింది. అందుచేత అక్కడ కొంచెం విరామం ఇస్తే మరింత అందగిస్తుంది.