క్ష్ | ఊరూ పేరూ తెలియని వాడా ఓ హృదయేశ్వరుడా తీరూ తెన్నూ రూపురేఖలూ తెలియని స్నేహితుడా |
||
నీ చెయిదంబులు చిత్రములనుచు నిత్యము విందునయా ఆ చిత్రములనె నిత్యము తలచుచు నానందింతునయా ఈ చరాచరసృష్టిని చేసిన యీశ్వరుడా ఘనుడా ఓ చెలికాడా నాకు దక్కితివి యూర నిందరుండ |
ఊరూ పేరూ | ||
వచ్చెడి పోయెడివారు చేయు బహుభంగుల సందడితో నిచ్చట నాశాజీవుల గడబిడ లచ్చెరువులు గొలుపన్ ముచ్చట గొల్పెడు నరలోకంబున ముదమున నన్నుంచి నెచ్చెలి యీ నాటకము జూచెదవు నిచ్చలు నాతోడన్ |
ఊరూ పేరూ | ||
తామరాకుపై నీటిబొట్టువలె తత్త్వఙ్ఞు డనగు నే నేమియు నెఱుగని వారలు బలికెడి యెగ్గుల నెన్నుదునా ఓ మహాత్ముడా యీశ్వరుడా నీ వొకడవు తోడుండన్ భూమిని నింగిని పాతాళంబున పొంగుచు నేనుందున్ |
ఊరూ పేరూ | ||
16, ఏప్రిల్ 2016, శనివారం
ఊరూ పేరూ తెలియని వాడా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.