13, ఏప్రిల్ 2016, బుధవారం

నీ మాట విందునని నా మాట విందువా?









       నీ మాట విందునని నా మాట విందువా
నీ మాటనే సతము నెగ్గించుకొందువా

   


తోలుతిత్తులలోన త్రోయుట మానుమని
వేలమారులు నిన్ను వేడితే వింటివా
నేల మీద నేను నిలబడి యాడితే
చాలు వేడుక నీకు సంకటము నాకు
నీ మాట


కామాదులకు చిక్కి కటకట బడనీక
ప్రేమతో బ్రోవుమని వేడితే విందువా
ఏమోమొ చెప్పేవు యేమార్చి పంపేవు
నీ మాయ నీశ్వరా నామీద జూపేవు
నీ మాట


ఇర్వుర మొక్కటా యిడుము లన్నియు నాకా
యుర్విపై నాయాట లున్నది నీ కొఱకా
సర్వేశ్వరా యింక చాలునంటే వినవు
పూర్వస్థితిని పొంద బుధ్ధాయె రామ
నీ మాట












8 కామెంట్‌లు:

  1. ఆధ్యాత్మిక కవిత మరీ ఇంత తేలిక శబ్దాల లోనా?! ఇలా వ్రాయడం మీకే చెల్లింది!--- శ్రీధర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వాగతం శ్రీధర్ గారూ,
      మీకు నచ్చినందుకు నా ధన్యవాదాలండీ.

      తొలగించండి
  2. ఒక ఆణి ముత్యం.

    ఒక విన్నపం:
    దీన్ని కాపీ చేసుకుని నిత్యం చూడడానికి సావకాశం ఇప్పించండి.
    సంవత్సర నియమం సడలించండి.( నన్ను తిట్టుకున్నా )
    ఈ వ్యాఖ్యని ఎడిట్ చేయండి కావాలంటే, లేదా ప్రచురించడమే మానెయ్యండి, మీరు జన సామాన్యం లోకి రండి! ఇది నా ప్రార్ధన,విన్నపం,వేడుకోలు........

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పరిస్థితిని చూస్తూనే ఉన్నారు. నాకు జీవికకోసం ఉద్యోగం తప్పక జనంలో ఉంటున్నాను. అంతవరకే అన్నట్లుంది. మిగిలిన నా ప్రపంచం వేరే ఐపోతోంది. సంవత్సరనియమం ఐనా మరొకటైనా ఎవరికీ ఇబ్బంది కలిగించటానికి కాదు. కాని నన్ను నేను లౌకికప్రపంచం నుండి తగినంత దూరంలో ఉంచుకోవటానికి మాత్రమే. పెద్దలు మీ ఆజ్ఞప్రకారం కానివ్వండి. అభ్యంతరం లేదు. పద్మపత్రమివాంభసా అన్నటుగా నేను ఉండటం నా చేతిలోని వ్యవహారమా ఈశ్వరుడి చేతిలోని వ్యవహారమా? అందుచేత అహమిక ఏమీ అవసరం లేదు కదా. కానివ్వండి.

      ఈ పాట కాపీ చేసుకుందుకు ఇబ్బంది ఏమున్నది? ఎవరికైనా నచ్చితే అలాగే చేసుకోవచ్చును కదా?

      తొలగించండి
  3. ఇటువంటివి పాట పాడి వాయిస్ రికార్డింగ్ బ్లాగులో పెడితే బాగుంటుందండి. పాట వింటూ చదువుకోవచ్చు. ఏమంటారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవుననుకోండి. కాని నేను పాడితే జనం పారిపోతారేమో!ఉపాయం ఆలోచిస్తున్నాను.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. శర్మగారూ,
      ఈ పాటమీద పెద్ద టపాయే వ్రాసారు!
      అనేక ధన్యవాదాలు.
      మీ వ్యాఖ్యానం అమోఘం!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.