20, ఏప్రిల్ 2016, బుధవారం

మాయ నన్ను కప్పెనా మంచిదే కదా
     మాయ నన్ను కప్పెనా మంచిదే కదా
మాయ నన్ను విడచెనా మంచిదే కదా

    


మాయావరణంబు గలిగి మసలుచు నేనుండగా
మాయదారి మనుషులు నా మార్గమెఱుగ జాలరుగా
హాయిగా నిన్ను నే ధ్యానించుకొందునురా
ఓ యీశ్వర యంతకన్న నున్నదా సదుపాయము
మాయ


నీకు నాకు మధ్య మాయ లేకు మంచిదె రామ
ఏకమై యుండెద మది యెంతమంచిదో రామ
నీకిది సమ్మతమే నని నే నెఱుంగుదును రామ
నాకిది యానందమని నీకు మున్నె తెలియును రామ
మాయ


ఎవడ వీవు యేది మాయ  యేది మంచి యేది చెడుగో
యెవడ నేను యెవ్వ రొరులు హెచ్చు తగ్గు లెటుల గలుగే
నివల నవల నున్నవాడ వెంచ నన్నియును నీవ
భవుడ వభవుడవు నీవ పరమసత్యమవు నీవ
మాయ

2 వ్యాఖ్యలు:

  1. సుయోధనుడు,దుర్యోధనుడు - ఈ రెంటిలో యేది అసలు పుట్టగానే పెట్టిన పేరు?పనిగట్టుకుని ఎవరూ పిల్లలకి చెడు అర్ధం వచ్చే ఏర్లు పెట్టరు గదా!దుర్యోధన,దుశ్శాసన లాంటి పేర్లు కవి కావ్యమర్యాద కోసం "వీడు చెడ్డవాడు సుమా!" అని చెప్పటానికి పెట్టిన పేర్లు కావచ్చు.అలా కాకుండా మీకేదయినా విశషం తెలిస్తే చెప్పగలరు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. పటము అంటే బట్ట. ఉదాహరణ చెప్పమంటారా ఈ‌మాటకు 'పైనున్న పచ్చని పటము జార' అన్న ప్రయోగం. ప్రత్యేకమైన లేదా విశిష్టమైన పటము అని చెప్పటానికి దానికి ముందు 'దు:' అన్న ఉపసర్గను చేర్చితే అది దుప్పటము అయ్యింది. అదే తెలుగు వాళ్ళకి దుప్పటీ అయ్యింది. హిందీవాళ్ళ దుపట్టా కూడా ఇదే అర్థంలో వచ్చిందే. దుర్యోధన దుశ్శాసనాదుల పేర్లలో ముందు ఉన్న ఉపసర్గ అదే. దురర్ధం వచ్చేది కాదు. కాని వాళ్ళప్రవర్తనలతో వాళ్ళ పేర్లకు మచ్చ వచ్చిందన్నది వేరే సంగతి.

      తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.