2, జులై 2015, గురువారం

జూలై 2015 మాలిక సంచికలో నా కథ

ఈ జూలై 2015 మాలిక సంచికలో నా కథ ఒకటి ప్రచురితమైనది.
పాఠకులు చదివి అక్కడే అభిప్రాయాలను చెప్పవలసిందిగా ప్రార్థనఈ కథకు బీజావాపనం చేసిన సంఘటన కష్టేఫలీ భాగులో ఇటివల నేను చేసిన ఒక వ్యాఖ్య!

అ వ్యాఖ్యను క్రింద ఇస్తున్నాను:

0
0

Rate This
ఈ కథలో ఒక బ్రాహ్మణుడి ప్రసక్తి వస్తుంది. కాని దాని గురించిన విచికిత్స ఇక్కడ చేయటానికి వలనుపడదు. అది ఒక విస్తారమైన విషయం. ఎలా సుళువుగా చెప్పాలో అన్నది ఇబ్బంది. బహుశః ఒక కథారూపంగా మలచి చెప్పితేనే అందులోని సారస్యమూ మిగతా కథా కమామిషూ మన తలలకు బోధపడుతాయి. కాని దురదృష్టవశాత్తు ఆ విషయంలో ఇప్పుడు వ్రాయటానికి నాకు తీరటం లేదు.ఆఫీసుపని సమయం కదా! అందువలన అన్నమాట. దైవానుగ్రహం ఉంటే ఈ రాత్రి ఆ పని చేయాలని భావిస్తున్నాను.

అదండి సంగతి,
కథను తప్పక చదివి మీ అభిప్రాయాలు వ్రాయండి.

( అడక్క పోతే అమ్మ కూడా పెట్టదు,  కోరకపోతే కామెంట్లు కూడా రావు అంటారు కదా! )

4 కామెంట్‌లు:

 1. కథ ఇక్కడా ప్రచురించండి, మిగా భాగానికి ఎదురుచూస్తున్నాం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కాలక్రమంలో ఇక్కడా ప్రచురించుకోవాలండి. కాని ఇప్పుడే ప్రచురించటం వలన మాలికకు ఇబ్బంది కదా. ఆగష్టు మాలిక సంచిక వచ్చాక మొదటి భాగం ఇక్కడకు తెద్దాము.

   తొలగించండి
 2. కథ బాగుంది

  మిగిలిన భాగాల కోసం ఆసక్తి తో ఎదురు చూస్తున్నాం.

  ఇంతకీ ఆసక్తి తో ఎదురు చూడడం అహింస యా లేక హింసయా ??

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హింస కాదండీ.
   మీరు ఎదురుచూసేలా చేయటం వెనుక నా స్వార్థప్రయోజనం ఏమీ లేదు కాబట్టి హింస కాదు.
   మామిడి టెంక నాటుతాం. ఆబ్బో ఆ పండు ఎంతో తీయగా ఉంది కాబట్టి, ఈ టెంకనుండి మొలకెత్తిన మొక్క పెద్దదై ఎన్నేసి తీయని పండ్లు ఇస్తుందో అని ఎదురు చూస్తాం. ఎదురుచూసేలా చేసినది మన మనసే కాని టెంక కాదు కదా. అందుచేత టెంక చేసిన హింస యేమీ లేదని తాత్పర్యం. కొంచెం ఎదురు చూడండి మరి. అన్నీ కాలంలోనే పండుతున్నాయి!

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.