మౌనముగ రాముని మనసున ధ్యానింపుము మానక ధ్యానింతు వేని మంచి జరుగును |
|||
వారి వీరి మాటలకు బదులు పలుక కుండుము ఊరక నిందించు వారి నేరమెంచ బోకుము కారులఱచు వారలకు దూరముగ నిలచి పారమార్థికము నిచ్చు దారిలోన నుండుము |
మౌనముగ | ||
కర్మముచే కలుగుచుండు కష్టములు సుఖములు ధర్మపరుడవై నీవు దాశరథిని తలచుము నిర్మలాంతఃకరణము నీవు దాల్చి యుండుము నిర్మములను దాశరథి నిత్యము రక్షించును |
మౌనముగ | ||
భూమి నెవరు గాని నిన్ను బ్రోచు వారు కాదు రామరక్ష తప్ప ధరను రక్ష వేరు లేదు ధీమంతులకు భువిని కామితములు లేవు రామదాసులకు నిజము రాముడొకడు చాలు |
మౌనముగ |
15, జులై 2015, బుధవారం
మౌనముగ రాముని మనసున ధ్యానింపుము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
>> భూమి నెవరు గాని నిన్ను బ్రోచు వారు కాదు
రిప్లయితొలగించండిwonderful