| విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి నా కేడుగడవు నీ కేమిత్తునయా నీ వేడుక తీరగ పాడుట గాక |
|
| తడవకు తప్పులు వెదికే జగమును విడిచి నీ మరువును సొచ్చితిని గడబిడ పడు నా మనసున నీవే వడివడి శాంతము నింపితివి |
|
| గడచిన బ్రతుకుల కలిగిన స్నేహము విడువని నిన్నేమని పొగడుదును నడువనిమ్ము నీ యడుగుల నడుగిడి ఇడిముడియా ఈ నీ నా ప్రేముడి |
|
| బడుగు వీ డని తలపవు రామా కుడిపెద వోహో కరుణామృతము కడలి కంటె గంభీరము నీ హృది బడలనీక నను పాలించెదవు |
|
16, జులై 2015, గురువారం
విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.