ఉ. ఏటినిబడ్డవాని కొకటే కద నాశయమై రహించు నే చేటును బొందకుండ వెస చేరగ నొడ్డున నేటిగట్టు పూ దోటల సోయగంబు మది దూరునె తద్వ్యతిరేకధోరణిన్ మాటికి స్వల్పసౌఖ్యముల మానక గోరును నా మనంబహో |
ఉ. నాలుగు మంచిమాటలను నల్గురు చెప్పచు నుందు రెప్పుడున్ మేలు పరోపకారమని మేలగు సజ్జన గోష్ఠి నుంటయున్ మేలు త్రిశుధ్ధివర్తనము మేలు పరాత్పర కీర్తనంబు నా నేల యెఱింగియున్ నడువ దీమన మించుక మంచిదారిలో |
ఉ. నేనిపు డేమి సేయుదును నీ శుభ పాదసరోరుహమ్ములన్ ధ్యానము సేయ నొక్క క్షణమైనను బుధ్ధిగ నుండ నొల్ల దీ మానస మీశ్వరా పనికిమాలిన చోటుల సంచరించుటన్ మానగ లేని దాని పయి మానక నీ దయ చూపవే ప్రభూ |
మ. ఇది నా మాటను లెక్కచేయ దిక నీవే చూచి రక్షించ బూ నుదు వేనిన్ సరియైన దారి జను మానున్ దుష్క్రియాసక్తి సం పదలున్ బంధుజనంబులున్ బిరుదులున్ భావించి యల్లాడుటల్ వదలున్ నీ శుభనామకీర్తనమహాభాగ్యంబు నాశించెడున్ |
ఉ. దేవుడ వీవు నీవలన దీరని కార్యమొకండు గల్గునే జీవుడ నేను నాదయిన చిత్తము నిన్ను గ్రహింప నేర్చునే కావున నీవు మాయ దొలగం గృప సేయుము నీదు తత్త్వమున్ భావన జేయనిమ్ము భవబంధము డుల్లగ నిమ్ము నెమ్మికన్ |
ఉ. విన్నప మాలకించితివి వీఱిడి వోవగ నీక దాని నా పన్నశరణ్య నీ దయకు పాత్రము సేయుము నా మనంబు ని న్నెన్నడు గాని యేమఱక యీశ్వర కూర్మిభజించు నట్లుగా మన్నన చేయుమయ్య పరమాత్మ పరాత్పర సర్వరక్షకా |
23, జులై 2015, గురువారం
విన్నపం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆర్తి కనపడుతోంది,భావ ప్రకటనలో కొనసాగించండి.
రిప్లయితొలగించండిఈ పద్యాలు ఏ వృత్తాల్లో రాసారో చెప్తే బావుండేది. (చ. శా. మ. అనే అక్షరాలు పద్యం ముందు రాస్తే అవి ఏ వృత్తాలో చదువరులకి వెంఠనే తెలుస్తుంది కదా?). కొనసాగించండి అనలేకపోతున్నాను; ఎందుకంటే మీరు ఏదో ఒకటి మొదలు పెట్టడం దాన్ని మధ్యలో వదిలేయడంలో బాగా ఆరితేరిపోయేరు. ఏమనుకోకండి మరి ఇలా అంటున్నందుకు.
రిప్లయితొలగించండినమస్తే
DG గారు.
తొలగించండిఉశామచకాదులు తగిలించటం అంత అవసరం కాదు కాని కొందరి సౌలభ్యం కోసం తగిలించటం మంచిదే. మీ సూచన పాటించాను. మరొక సూచనా గమనించాను. అదీ వీలు వెంబడి......
Buddhiga ekkuvayyindi
రిప్లయితొలగించండిఅవును నరసింహం. సరిచేసాను, ధన్యవాదాలు.
తొలగించండి