8, జూన్ 2015, సోమవారం

విష్ణుసహస్రనామస్తోత్రంలో పునరుక్తనామాలు

ఈ రోజున నా క్రిందటి టపాను చదివిన భాస్కరంగారు కొన్ని ముఖ్యమైన సందేహాలు ప్రస్తావించారు.  అందులో ఒకటి ' 'కౌలీనికేవలా' అని ఒకే నామంగా చూపించడం పునరుక్తి పరిహరణ కన్నారు. అలాగైతే విష్ణు సహస్రనామాలలో కూడా పునరుక్తులు ఉన్నాయి కదా?' అన్నది.

విష్ణు సహస్రానామస్తోత్రంలో దాదాపు ఇరవై శాతం నామాలు పునరుక్తం అవుతున్నాయి.  కేవలం సరదాకు వాటిని ఒక పట్టిగా ఇస్తున్నాను. గమనించండి.

క్రమసంఖ్య
నామం
ఉక్తస్థానాలు
 1
అచ్యుత
100, 318
 2
అజః
 95, 204. 521
 3
అనంతః
659, 886
 4
అనఘం
146, 831
 5
అనలః
293,711
 6
అనిరుధ్దః
185, 638
 7
అనిర్దేశ్యవపుః
177, 656
 8
అనిర్విణ్ణః
435, 892
 9
అనిలః
234, 812
10
అపరాజితః
716, 862
11
అమితవిక్రమః
516, 641
12
అమేయాత్మా
102, 179
13
అమోఘః
110, 154
14
అక్షోభ్యః
801, 999
15
ఆదిదేవః
334, 490
16
ఈశ్వరః
 36, 74
17
ఉద్భవః
373, 790
18
ఋధ్ధః
278, 351
19
కాంతః
296, 654
20
కుముదః
589, 807
21
కృతజ్ఞః
 82, 532
22
కృతాగమః
655, 789
23
గహనః
382, 544
24
గోపతిః
495, 592
25
గోప్తా
496, 593
26
గోవిందః
187, 539
27
చక్రీ
908, 995
28
చతురాత్మా
137, 769
29
చతుర్వ్యూహః
138, 767
30
తారః
338, 968
31
దక్షః
423, 917
32
దుర్ధరః
266, 715
33
నిరిత్తాత్త్మా
229, 597
34
పద్మనాభః
 48, 196, 346
35
పావనః
292, 811
36
పుణ్యః
687, 925
37
పురుషః
 14, 406
38
పుష్కరాక్షః
 40, 556
39
ప్రజాపతిః
 69, 197
40
ప్రణవః
409. 957
41
ప్రభుః
 35, 299
42
ప్రమాణమ్
428, 959
43
ప్రాణః
 66, 320, 407
44
ప్రానదః
 65, 321, 408
45
భీమః
357, 948
46
భోక్తా
143, 500, 888
47
మహాకర్మా
672, 787
48
మహీధరః
317, 369
49
మాధవః
 72, 167, 735
50
మార్గః
365, 397
51
యజ్ఞః
445, 971
52
వసుః
104, 270, 696
53
వసుప్రదః
693, ???
54
వసుమనాః
105, 687
55
వాయువాహనః
331, 856
56
వాసుదేవః
332, 695, 709
57
విక్రమీ
 75, 909
58
విధాతా
 44, 484
59
విభుః
240, 880
60
విశ్వయోనిః
117, 149
61
విష్ణుః
  2, 258, 657
62
వీరః
401, 643, 658
63
వీరహాః
166, 741, 927
64
వేదవిత్
128, 131
65
శివః
 27, 600
66
శుచిః
155, 251
67
శుభాంగః
782, 586
68
శౌరిః
340, 644
79
శ్రీనివాసః
183, 607
70
శ్రీమాన్
 22, 178, 220
71
సంవత్సరః
 91, 422
72
సతాంగతిః
184, 450
73
సత్యః
106, 212, 869
74
సర్వజ్ఞః
453, 815
75
సవితా
884, 969
76
సహిష్ణుః
144, 565
77
సింహః 200, 488
78
సిధ్ధః
 97, 819
89
సుఖదః
459, 889
80
సుపర్ణ
192. 855
81
సువ్రతః
455, 818
82
స్థవిష్ఠః
 53, 436
83
స్రష్టాః
588, 990
84
హిరణ్యగర్భః
 70, 411
85
హుతభుక్
879, 887
86
క్షామః
443, 854


చూసారా?  మొత్తం 86 నామాలు పునరుక్తం ఐనట్లుగా కనిపిస్తున్నాయి.  మొత్తం ఈ పై నామాలు సహస్రనామావళిలో 86 x 2 + 13 = 185 స్థానాల్లో ఉన్నాయన్నమాట. ఇది  18.5 శాతం!  తక్కువేమీ కాదు!

ఐతే ఇవి పునరుక్తులుగా పరిగణించరు సంప్రదాయికంగా. ఎందువలన అన్న ప్రశ్నకు జవాబు ఉంది.  

విష్ణుః మొదలైన అనేక నామాలు పునరుక్తంగా కనిపిస్తున్నా జాగ్రతతో చూస్తే అవి వేరు వేరు అర్థాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి పునరుక్తి ఎక్కడా లేదు. అంటే  ఒక శబ్దాన్ని వేరు వేరు రకాలుగా విడదీసి చూడవచ్చు నన్నమాట.

మరికొన్ని నామాలకు ఒకటి కంటే ఎక్కువగా అర్థాలు వ్యాకరణాకార్యాపేక్ష లేకుండానే ఉంటాయి. ఉదాహరణకు శ్రీపతి అన్న మాటలో శ్రీ అన్న మాటకు లక్ష్మి అని అర్థమూ ఉంది మోక్షము అని అర్థమూ ఉంది.  ఉభయత్రా విష్ణుప్రైపాదకమైన నామం అవుతున్నది. ఇలా అర్థం పునరుక్తి కనిపించిన చోట్ల ఒకటి కంటే ఎక్కువ అర్థాలున్నాయి.

సకృత్తుగా ఒకే అర్థం ఇచేట్లు కనిపించే నామాలు కొన్ని సందర్భాను సారంగా మరలా వచ్చినా అది దోషం కాదు స్తోత్రాలలో. సందర్భం వేరు కదా.

ఋధ్ధః అన్న నామం 271వదిగా ఉంది. దానికి శ్రీశంకరుల భాష్యం ప్రకారం సమృధ్ధి కలవాడు. వేటి సమృధ్ధి అంటే  ధర్మము జ్ఞానము వైరాగ్యము వంఇ ఉత్తమ లక్షణముల సమృధ్ధి కలవాడు అని అర్థం. ఇదే   351వ నామం కూడా. అక్కడ భాష్యంలో ఋధ్యతి - వృధ్ధిని పొందును. అనగా ప్రపంచరూపము నృధ్ధిని పొందుచున్న వాడుగా ఉన్నాడు.  ఋధు వృధ్ధౌ అనే ధాతువు నుండి క్త ప్రత్యయం ద్వారా ఈ రూపం నిష్పన్నం అవుతున్నది. ఋధ్ధ్ + త -> ఋధ్ధః
ఇలా ఒకే నామం వేరు స్థానాల్లో వేఉ అర్థంతో వ్యవహరించవచ్చును కాబట్టి పునరుక్తి ఏమీ లేదు. 

వేదవిత్ అనే నామం 128వది అలాగే 131వది కూడా! మరీ దగ్గరగా.  అదీ ఒకే శ్లోకార్థంలో! వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవికవిః అని. ఇక్కడ సందర్భాను సారిగా వేదశబ్దాన్వయం మీద అర్థఛ్చాయలతో విడి నామాలే. ఒకే అర్థం చెప్పబడదు. కొద్దిగా విపులంగా చూదాం.

వేదవిత్ అనే 128వ నామానికి వ్యాఖ్య.  వేదం వేదార్థంచ చ యథావిత్ వేత్తిః అనగా వేదమును దాని అర్థమును కూడా వాటివాస్తవరూపంగా స్పష్టంగా తెలిసినవాడు.  వేదాంతకృత్ వేదవిత్ ఏవచ అహం అని గీతలో 15వ అధ్యాయంలో భ్గవద్వచనం. ఉపనిషత్ వేదాంత సంప్రదాయాన్ని ఏర్పరచే వాడినీ, వేదార్థమును చక్కగా అంటే సంపూర్ణంగా తెలిసినవాడినీ నేనే అని కృష్ణోక్తి. భారతంలో 
  సర్వే వేదాః సర్వవేద్యాః సశాస్త్రాః
 సర్వే యజ్ఞాః సర్వ ఇజ్యాశ్చ కృష్ణః
 విదుః కృష్ణం  బ్రాహ్మణాః తత్త్వతో యే
 తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తః

అంటే అన్ని వేదాలూ, వాటిచే తెలియబడే సకలవిషయాలూ, అన్ని యజ్ఞాలూ, వాటిద్వారా ఆరాధించబడే దేవతలూ,  అంతా కృష్ణుడే. ఏ బ్రహ్మవేత్తలు శ్రీకృష్ణుని వాస్తవంగా తెలుసుకుంటున్నారో వారికి సర్వయజ్ఞఫలితాలూ అందుతున్నాయి అని దీని అర్థం.

వేదవిత్ అనే 131వ నామానికి వ్యాఖ్య. వేదాన్  - వింత్తే - విచారయతి. వేదార్థమును చక్కగా విచారణ చేయును అని.

ఇక విష్ణుః అనే నామానికి ఉన్న వివిధ వ్యాఖ్యలను చెప్పాలంటే అదే మరొక పెద్ద టపా అవుతుంది.

అన్నట్లు ఇదే ఇప్పటికి విస్తారం ఐనది కదా. మరొకటపాలో కొనసాగిద్దాం.

7 కామెంట్‌లు:

  1. మాస్టారూ,అసందర్భం అయినా పదే పదే అడుగుతున్నా ఒక పోస్టు కోసం అవస్రమయ్యి - peppar అంఅంటే మిరియాలేనా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంగీషులో పెప్పర్ అంటే మిరియం అనే సాధారణంగా అర్థం.

      బెల్ పెప్పర్ అని గంటలాంటి ఆకారంతో రంగుల్లో వచ్చే మిరపకాయలలోనూ ఈ పెప్పర్ అన్న పదం చూస్తున్నారు కదా,

      అలాగే అమెరికాలో (మరికొన్ని చోట్ల కూడా బహుశః) మిరపకాయలను పెప్పర్స్ అని పిలుస్తారు. ఉదాహరణకు చిలీ పెప్పర్స్ అని మన పండు మిరపకాయల వలె ఉంటాయి.

      మిరియాలను బ్లాక్ పెప్పర్ అని పిలవటం కద్దు - మిరపకాయలతో కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం.

      తొలగించండి
    2. మరొక మాట, పెప్పర్ స్పెల్లింగ్ pepper అని. peppar అని కాదు.

      తొలగించండి
    3. స్పెల్లింగ్ తెలుసు మాస్టారూ,ఇక్కడ తప్పు పడింది,కృతజ్ఞుణ్ణీ!

      తొలగించండి
  2. సీ||శ్రీరమ సీతయై శ్రీనిధితో పలి
    కిన పలుకుల మెరిసినది తెలుగు


    వారి జీవనదము - గోదావరీ మాత!
    దక్షిణ గంగ!వేదములను విని

    వేదములను పలికే చిలుకల కొలి
    కి!పొడుపు మలపైకి ఇనుడు రాక


    మున్నె దేవతలు తా మునిగి తరించు మ
    హిమలు గల రసధుని!వగపేల

    తే||ఆంధ్రులార,గోదావరి పారునంత
    వరకు మనకిక తిరుగు లేదండి!పట్టి
    గుండెలో నిల్పి దేవిలా కొల్చి హార
    తులను ఇవ్వరే - తల్లికి తగిన రీతి?!

    యెలా వుంది పద్యం?బాగుంటే మీరొక పోష్తు రాయాలి!నాకు కుదరటం లేదు,అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను.

    ముందరి వెర్షన్లో అచ్చుతప్పులు వచ్చాయి,ఇప్పుదు చూడండి!

    రిప్లయితొలగించండి
  3. http://syamaliyam.blogspot.in/2015/07/2015.html
    శ్యామలీయంగారు,
    పై టపాకి ఇక్కడేమో గేట్ మూసేశారు, మాలికలో కాపలా పెట్టేశారు, పోలీసుల్ని, ఎలా వచ్చేది?
    టపా అద్భుతః, చాలా చిన్నమాట.

    రిప్లయితొలగించండి
  4. అయ్యో మాలికతో ఇబ్బంది ఉందన్నది నాకు తెలియదండీ.సరే తలుపులు తెరుస్తున్నాను!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.