చేయెత్తి మ్రొక్కేరులే నీకు శ్రీరామ బ్రహ్మాదులు నీయందు నిలిపేరులే భక్తి నిత్యంబు మోక్షార్ధులు |
|
సామాన్యులైతే సంసారమొకటే సత్యంబుగా నెంచుచు నీ మాట మరచి వ్యామోహములలో నిత్యంబు వర్తించుచు కామాదులకు లొంగి కానిపనులుచేసి కలగుండు పడుచుందురు ఏ మయ్య నీ దయ రాకున్నచో వార లేరీతి తరియింతురు |
॥చేయెత్తి॥ |
విజ్ఞానులైతే విషయభోగంబుల వైకృత్యముల నెంచుచు అజ్ఞానులగువార లట్టివి గోరుచు నడుగంటుటను కాంచుచు ప్రజ్ఞానిధులుగాన భగవంతుడవు నిన్ను భావంబులోనెంచుచు యజ్ఞసంభవ రామ సుఖముందు రితరుల కాదర్శమై యుందురు |
॥చేయెత్తి॥ |
అయ్యో తెలియని వారు సామాన్యు లనరాని దక్కట మాబోంట్లను అయ్యారె విజ్ఞాను లనరాదు మాబోంట్ల నల్పప్రజ్ఞుల మగుటను వెయ్యి జన్మములెత్తి వేసారి యుంటిమి వెగటాయ బ్రతుకులును కుయ్యాలించుము మమ్ము కాపాడగ రమ్ము కోదండరామప్రభో |
॥చేయెత్తి॥ |
2, జూన్ 2015, మంగళవారం
చేయెత్తి మ్రొక్కేరులే నీకు శ్రీరామ బ్రహ్మాదులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.