ఆ.వె. నాల్క పైన రామనామమ్ము నుంచక
జిహ్వ పైన పట్టు చిక్కబోదు
జిహ్వ పైన పట్టుచిక్కని మనిషికి
జీవితమున సుఖము చిక్కబోదు
ఓ రామచంద్రప్రభూ!
ఈ నాలుక ఉన్నదే ఇది బహు చెడ్డది.
దీనిని అదుపు చేయని వాడికి సుఖం దుర్లభం.
ఒకటే మార్గం ఉంది.
జిహ్వకు రామనామాన్ని అందించటమే.
అది ఆసుఖం అనుభవించి దారిన పడుతుంది.
అప్పుడు కాని జీవుడికి జీవితంలో సుఖం ఉండదు.