కం. రాముని కిచ్చిన దినమే
భూమిని సుదినం బటండ్రు బుధవరు లటులే
రాముని గొలిచిన బ్రతుకే
భూమిని బ్రతుకనుచు మనకు బోధింతురయా
ఓప్రజలారా సత్పురుషులు ఒకమాట అంటూ ఉంటారు. ఏరోజును ఐతే మనం రాముడి సేవకోసం వినియోగిస్తామో అదే సుదినం అని.
అలాగే వాళ్ళు మనకు మరొక మాటనూ తరచుగా బోధిస్తూ ఉంటారు. రాముణ్ణి సేవించిన జీవితమే జీవితం అని.