శ్రీరఘురాముని శుభనామం జీవుల సంరక్షించే నామం
జిహ్వాగ్రంబున చిందులు త్రొక్కును శ్రీరఘురాముని శుభనామం
జిహ్వకు మకరందము కన్నను రుచి శ్రీరఘురాముని శుభనామం
చింతలవంతల పారద్రోలు నీ శ్రీరఘురాముని శుభనామం
చిక్కుల నన్నిటి చెదరగొట్టునీ శ్రీరఘురాముని శుభనామం
చిత్తవికారము లణచివేయునీ శ్రీరఘురాముని శుభనామం
చిత్తశాంతి కలిగించు ననిశమును శ్రీరఘురాముని శుభనామం
సీతాసాధ్వికి ప్రాణప్రదమీ శ్రీరఘురాముని శుభనామం
సీరియతిరువడి జీవనమైనది శ్రీరఘురాముని శుభనామం
శివు డతిప్రీతిగ జపియించునదీ శ్రీరఘురాముని శుభనామం
జీవుల మోక్షపురంబున జేర్చును శ్రీరఘురాముని శుభనామం