రామ రామ యని నామము బలుకగ రాదో జనులారా కామితఫలదుని ఘనతను పొగడుట కాదో మీ వలన |
|
సుజనుల కెపుడు సుఖము నొసంగే సూర్యవంశవిభుని విజయపరంపర వీనులవిందుగ వినిపించగ రాదా |
॥రామ రామ॥ |
నిరుపమగుణనిధి పరమాప్తుం డిది నిశ్చయమే కాదా పరమాత్ముని సంభావించుటలో పరమసుఖము లేదా |
॥రామ రామ॥ |
చతురాననశివశక్రసంస్తుతుని శరణు వేడ రాదా మతిమంతులరై మోక్షప్రదునిపై మనసు నిలుప లేరా |
॥రామ రామ॥ |
27, మే 2014, మంగళవారం
రామ రామ యని నామము బలుకగ రాదో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)