నే నొకడ ననుచు గలనా
నే నును గలననుచు జెప్పు నెడల నెవడనన్
పూని వచించిన వాడన
నే నని యెటులందు నీవె నేనై యుండన్
నేను నీకంటె వేఱైతి నేని నన్ను
నేన సృజియించి కొనియుంటి నేమొ లేక
నీవె సృజియించి యుంటివో నిశ్చయముగ
మంచి ప్రశ్నయె దీని యోచించ వలయు
నన్నునేనె సృష్టించుకో నగుట పొసగు
నేని మనమధ్య బాంధవ్య మెట్టి దగును
ప్రభుత యిర్వుర యందు కన్పట్టు టెట్లు
కనుక నీవాద మొప్పు గా దనుచు దోచు
నీవు సృష్టించి నావను భావనంబు
నిన్ను కర్తగా సేయక నెట్లు కుదురు
కర్త వగుదేని బోక్తయు గావలయును
కర్మ బంధంబు నీకును కలుగ వలయు
నన్నునేనె సృష్టించుకో నగుట గాని
నీవు సృష్టించి నావను భావనంబు
గాని పొసగమి నేనెట్లు కలిగితినన
దాని కెయ్యది తగు సమాధానమగునొ
సర్వమిప్పుడు చాల సుస్పష్టమాయె
నిర్వురము వేఱుగా నున్కి నిజము గాదు
మనకు బేధమే లేదన్నమాట యొకటె
నిజము ముమ్మాటి కిది యొండె నిజము నిజము
నే నును గలననుచు జెప్పు నెడల నెవడనన్
పూని వచించిన వాడన
నే నని యెటులందు నీవె నేనై యుండన్
నేను నీకంటె వేఱైతి నేని నన్ను
నేన సృజియించి కొనియుంటి నేమొ లేక
నీవె సృజియించి యుంటివో నిశ్చయముగ
మంచి ప్రశ్నయె దీని యోచించ వలయు
నన్నునేనె సృష్టించుకో నగుట పొసగు
నేని మనమధ్య బాంధవ్య మెట్టి దగును
ప్రభుత యిర్వుర యందు కన్పట్టు టెట్లు
కనుక నీవాద మొప్పు గా దనుచు దోచు
నీవు సృష్టించి నావను భావనంబు
నిన్ను కర్తగా సేయక నెట్లు కుదురు
కర్త వగుదేని బోక్తయు గావలయును
కర్మ బంధంబు నీకును కలుగ వలయు
నన్నునేనె సృష్టించుకో నగుట గాని
నీవు సృష్టించి నావను భావనంబు
గాని పొసగమి నేనెట్లు కలిగితినన
దాని కెయ్యది తగు సమాధానమగునొ
సర్వమిప్పుడు చాల సుస్పష్టమాయె
నిర్వురము వేఱుగా నున్కి నిజము గాదు
మనకు బేధమే లేదన్నమాట యొకటె
నిజము ముమ్మాటి కిది యొండె నిజము నిజము