3, అక్టోబర్ 2026, శనివారం

హరేహరే


హరేరామ హరేరామ రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే

నిరుపమానగుణాకర నీలవర్ణ హరేహరే
పరమయోగిసేవ్యమాన పాదపద్మ హరేహరే

మారజనక నారాయణ మధుసూదన హరేహరే
దూరీకృతభవబంధన తోయజాక్ష హరేహరే

దానవేంద్రమదవిదార మానవేంద్ర హరేహరే
జ్ఞానగమ్య సదానంద శ్రీనివాస హరేహరే

మునిమానసరాజహంస వనజేక్షణ హరేహరే
జనకసుతామనోరమణ జగదధీశ హరేహరే

సనకాదిమునీంద్రవినుత సర్వేశ్వర హరేహరే
వినతాసుతఘనవాహన విష్ణుదేవ హరేహరే

శాపతాపశమననిపుణశాంతమూర్తి హరేహరే
పాపతిమిరవిధ్వంసనభానుమూర్తి హరేహరే

సురనాయక నరనాయక వరదాయక హరేహరే
సురసన్నుత హరసన్నుత పురుషోత్తమ హరేహరే

సంసారనివార రామచంద్రదేవ హరేహరే
కంసాంతక కృష్ణచంద్ర కలుషాంతక హరేహరే


2 కామెంట్‌లు:

  1. శ్రీబివాస టైపోగ్రాఫికల్ యెర్రర్ శ్రీనివాస అని ఉండాలి. చివరకంటే ముందులైన్ సరిచేయాలేమో తాళమునకు చూడండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టైపోను సరిచేసాను.

      చివరిచరణం మొదటిపాదం
      సంసారనివార రామచంద్రదేవ హరేహరే
      ఇది నాలుగుమాత్రలతో ప్రారంభం కావటం వలన కొంత తాళక్లిష్టత కలుగవచ్చునేమో. కాని
      సంసా-రని-వార రామ- -చంద్ర-దేవ-హరే-హరే అని గానం చేస్తే ఇబ్బంది రాకూడదు అనుకుంటాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.