రామనామము చేయరే రామనామము చేయరే
భూమిజనులకు మోక్షమిచ్చే రామనామము చేయరే
భూమిజనులకు మోక్షమిచ్చే రామనామము చేయరే
కామితార్ధము లిచ్చు నామము రామనామము చేయరే
కామరోగము నణచునామము రామనామము చేయరే
పామరత్వము బాపు నామము రామనామము చేయరే
క్షేమదాయక మైన నామము రామనామము చేయరే
కామవైరి జపించు నామము రామనామము చేయరే
ప్రేమతో రక్షించు నామము రామనామము చేయరే
శ్యామసుందరు దివ్యనామము రామనామము చేయరే
నీమముగ భక్తాళి నేలెడు రామనామము చేయరే
ప్రేమతో రక్షించు నామము రామనామము చేయరే
శ్యామసుందరు దివ్యనామము రామనామము చేయరే
నీమముగ భక్తాళి నేలెడు రామనామము చేయరే
శ్యామలీయం గారు,
రిప్లయితొలగించండిబాగుంది.
1. కామవైరి జనించు నామము రామనామము - అంటే ఏమిటో అర్థం కావడం లేదు. వివరింపగలరు.
2. చివరి వాక్యంలో నీమముగ "భక్తాళి" అనే బదులుగా పొరపాటు దొర్లింది. సరి చూడగలరు.
జనించు,. ముక్తావళి అని పడటం మొబైల్ కీబోర్డు అటో కరెక్షన్ మహిమలే నండీ. సరిచేసాను.
తొలగించండి